సినిమా ప్రమోషన్‌లో గలాటా

సాక్షి, గుంటూరు ఈస్ట్: ‘ప్రతిరోజూ పండుగే’ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశం రసాభాసగా మారింది. ఈ నెల 20న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ యాత్రలో భాగంగా గుంటూరు భాస్కర్ థియేటర్‌కు హీరో సాయిధరమ్ తేజ్, కథానాయకి రాశీఖన్నా వచ్చారు. వారి వెనుకే అభిమానులు పెద్ద సంఖ్యలో బౌన్సర్‌లను తోసుకొచ్చారు. సాయిధరమ్ తేజ్ మైకు తీసుకోగా ఆకతాయిలు అల్లరి చేయడం మొదలెట్టారు. దీంతో హీరో హీరోయిన్లు థియేటర్ పైఅంతస్తుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు, అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత అంధ విద్యార్థులకు చెక్కుల పంపిణీ చేశారు.
అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. సత్యరాజ్, రావు రమేశ్, విజయ్‌కుమార్, నరేశ్, ప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి