విజయకాంత్ మిత్రుడు ఇబ్రహీం మృతి | Tamil film producer Ibrahim Rowther dead | Sakshi
Sakshi News home page

విజయకాంత్ మిత్రుడు ఇబ్రహీం మృతి

Jul 22 2015 1:43 PM | Updated on Sep 3 2017 5:58 AM

ఇబ్రహీం, విజయకాంత్(ఫైల్)

ఇబ్రహీం, విజయకాంత్(ఫైల్)

తమిళ సినీ నిర్మాత, విజయకాంత్ చిరకాల మిత్రుడు ఏఎస్ ఇబ్రహీం రౌథర్(64) కన్నుమూశారు.

చెన్నై: తమిళ సినీ నిర్మాత ఏఎస్ ఇబ్రహీం రౌథర్(64) కన్నుమూశారు.  కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం ఎస్ఆర్ఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్ల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆయన తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయారు. రౌథర్ ఫిలిమ్స్ పతాకంపై ఆయన పలు సినిమాలు నిర్మించారు.

రాజకీయ నాయకుడిగా మారిన హీరో విజయకాంత్ కు చిరకాల మిత్రుడైన ఇబ్రహీం అవివాహితుడు. విజయకాంత్ సినిమా జీవితానికి ఇబ్రహీం ఇరుసులా ఉపయోగపడ్డారు. భరతన్, కారుప్పనిలా వంటి హిట్ సినిమాలు తీశారు. ఆయన తీసిన చివరి సినిమా 'పుత్తితగ ఆనందమ్ పుత్తితగ ఆరంబం' కొన్ని నెలల క్రితం విడుదలైంది. ఇబ్రహీం మరణం పట్ల తమిళ చిత్రపరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement