‘ఆగడు’ సినిమాలో మహేష్ పాత్ర చాలా మాసివ్‌గా ఉంటుందని, తాను మహేష్‌ని ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నానో... అలాంటి పాత్రను ‘ఆగడు’లో మహేష్ చేయబోతున్నాడని,
‘ఆగడు’ సినిమాలో మహేష్ పాత్ర చాలా మాసివ్‌గా ఉంటుందని, తాను మహేష్‌ని ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నానో... అలాంటి పాత్రను ‘ఆగడు’లో మహేష్ చేయబోతున్నాడని, ‘ఆగడు’ లాంటి పవర్‌ఫుల్ సబ్జెక్ట్ చేసే ముందు ట్రయిల్‌గా మహేష్‌తో ‘దూకుడు’ చేశానని ఇటీవల దర్శకుడు శ్రీనువైట్ల చెప్పిన విషయం తెలిసిందే. ఆయన అన్నట్టుగానే... కథ రీత్యా ఇందులో మహేష్ ఎవ్వరూ ఊహించనంత మాస్‌గా కనిపిస్తాడని సమాచారం.
మరి అంత మాస్‌గాడి పక్కన జతకట్టే అమ్మాయి... అందుకు తగ్గట్టుగానే ఉండాలి అని అనుకున్నారో ఏమో... ‘ఆగడు’లో తమన్నా పాత్ర కూడా మంచి మాస్‌గా డిజైన్ చేశారట శ్రీనువైట్ల. ఇప్పటివరకూ కనిపించనంత మహా మాస్‌గా ఇందులో కనిపించనున్నానని తమన్నా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మహేష్‌కు జోడీగా నటించాలనేది నా కోరిక.
ఒకసారి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. డేట్స్ సర్దుబాటు చేయలేక నేనే వదులుకున్నాను. అప్పుడు నేను పడ్డ బాధ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ‘ఆగడు’లో అవకాశం రావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర గమ్మత్తుగా ఉంటుంది. మా ఇద్దరి కాంబినేషన్ తప్పకుండా ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని నా నమ్మకం’’ అన్నారు తమన్నా.