లిప్ కిస్‌లకు నో | Tamanna says no to lip locks and bikini | Sakshi
Sakshi News home page

లిప్ కిస్‌లకు నో

Feb 25 2014 3:55 AM | Updated on Apr 3 2019 6:23 PM

లిప్ కిస్‌లకు నో - Sakshi

లిప్ కిస్‌లకు నో

లిప్ కిస్సులకు నో అంటోంది తమన్న. తమిళం, తెలుగు భాషలలో అగ్రస్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ హిమ్మత్‌వాలా చిత్రంతో బాలీవుడ్‌లో కూడా రంగ ప్రవేశం చేసింది.

 లిప్ కిస్సులకు నో అంటోంది తమన్న. తమిళం, తెలుగు భాషలలో అగ్రస్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ హిమ్మత్‌వాలా చిత్రంతో బాలీవుడ్‌లో కూడా రంగ ప్రవేశం చేసింది. అక్కడే తొలి చిత్రం ఫ్లాప్ అయినా ప్రస్తుతం అదే చిత్ర దర్శకుడు సాజిత్ ఖాన్ తెరకెక్కిస్తున్న హంస కల్ చిత్రంలో తమన్నానే హీరోయిన్‌కావడం విశేషం. కోలీవుడ్‌లో వీరం చిత్రం హిట్ అయినా కొత్తగా అవకాశాలు రావడంలేదు. అయితే టాలీవుడ్‌లో, బాలీవుడ్ చిత్రాలతో ఈ మిల్క్ బ్యూటీ బిజీగానే ఉంది. తమన్నా మాట్లాడుతూ హిమ్మత్‌వాలా చిత్ర దర్శక, నిర్మాతలు తనపై నమ్మకంతో హీరోయిన్‌గా ఎన్నుకున్నారన్నారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదన్నది వాస్తవమే. 
 
 అయినా అది తన తొలి హిందీ చిత్రం మాత్రం కాదని అంతకు ముందే హిందీలో నటించానని చెప్పింది. అదే విధంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక మార్కెట్ ఉందని పేర్కొంది. నిజం చెప్పాలంటే రాత్రికి రాత్రి స్టార్ డమ్ పొందిన నటిని కాదని చెప్పింది. ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా ఏళ్లు శ్రమించానని పేర్కొంది. పలు చిత్రాలు అందులోను చాలా చిత్రాలు విజయం సాధించడం వల్లే ఉన్నత స్థాయికి ఎదగగలిగానని చెప్పింది. ఉత్తరాది అభిమానులకు దక్షిణాది అభిమానులకు అభిరుచిలో వ్యత్యాసం ఉందని తెలిపింది. ఇక్కడ కాస్త బొద్దుగా ఉండే హీరోయిన్లను కోరుకుంటారని బాలీవుడ్‌లో మాత్రం స్లిమ్‌గా ఉండాలని అక్కడ అభిమానుల మనసు దోచుకోవడానికి నాజూగ్గా తయారయ్యే ప్రయత్నం చేస్తున్నానని చెప్పింది. 
 
 ఒక చిత్రం అంగీకరించే ముందు షరతులు చాలా ముఖ్యం అని అంది. ప్రధానంగా ఈత దుస్తులు ధరించను, లిప్ కిస్సులకు అంగీకరించను వంటి విషయాలను ముందే దర్శక నిర్మాతలకు చెప్పేస్తానంది. దీనివల్ల షూటింగ్ స్పాట్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని చెప్పింది. నటిగా తనకంటూ కొన్ని హద్దులున్నాయని వాటిని మీరడం జరగదని పేర్కొంది. అదే విధంగా తాను అందం కోసం శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తన తల్లిదండ్రులు కూడా చాలా అందంగా ఉంటారు కాబట్టి సహజంగానే తాను అందగత్తెనని అంది. అలాగే తన ఆలోచనలు అందంగా ఉంటాయని అందువల్ల తాను అందం కోసం ఎలాంటి శస్త్ర చికిత్స చేయించుకోవలసిన అవసరం లేదని తమన్న పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement