అవకాశాలు పెంచుకునే దిశగా..

Tamanna in Queen Telugu Remake

తమిళసినిమా: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాలసీని పాటించే హీరోయిన్లలో నటి తమన్నా భాటియా ముందుంటారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నటిస్తున్న తమన్నా ఇంచుమించు స్టార్‌ హీరోలందరితోనూ నటించింది. దీంతో   పారితోషికాన్ని అందుకు తగ్గట్టుగానే పెంచుకుంటూ పోయిందంటారు. మధ్యలో అవకాశాలు కొరవడ్డా బాహుబలితో మరోసారి విజృంభించింది. అయితే ఆ క్రేజ్‌ను వాడుకోవడానికి పారితోషికాన్ని రూ.కోటి వరకూ పెంచేసిందట. దీంతో అవకాశాలు మళ్లీ తగ్గాయనే టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది.

ఆ మధ్య హిందీ చిత్రం క్వీన్‌ దక్షిణాది భాషలో రీమేక్‌లో నటించడానికి తమన్నాను సంప్రదించగా దర్శక నిర్మాతలు కళ్లు తిరిగి కిందపడేంత పారితోషికం డిమాండ్‌ చేసిందనే ప్రచారం జోరుగా సాగింది. తమన్నాకు అవకాశాలు తగ్గడానికి ఇదీ ఒకకారణం కాగా ఇటీవల ఈమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడడం మరో కారణం అన్నది చిత్ర వర్గాల టాక్‌. పరిస్థితులు చేజారిపోతున్నాయని గ్రహించిన ఈ బ్యూటీ ఒక మెట్టు దిగొచ్చి తన పారితోషికాన్ని తగ్గించుకోవడంతో మళ్లీ అవకాశాలు తలుపుతడుతున్నాయని సమాచారం.

ఇంతకు ముందు చిత్రానికి రూ.కోటి, సింగిల్‌ సాంగ్‌కే రూ.60 లక్షలు పుచ్చుకున్న తమన్నా తాజాగా పారితోషికం విషయంలో పట్టువిడుపుల విధానాన్ని పాటిస్తున్నట్లు సినీవర్గాల్లో చక్కర్లు కొడుతున్న టాక్‌. ఏదేమైన ఈ మిల్కీ బ్యూటీ చేతిలో ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో రెండేసి చిత్రాలు ఉన్నాయి. విక్రమ్‌తో రొమాన్స్‌ చేస్తున్న స్కెచ్‌ చిత్రం మినహా ఏ ఒక్క చిత్రం లోనూ స్టార్‌ హీరో లేరన్నది గమనార్హం. మరో విషయం ఏంటంటే ముందుగా క్వీన్‌ హిందీ చిత్రం రీమేక్‌లో నటించడానికి భారీ పారితోషికాన్ని డిమాండ్‌ చేసిన తమన్నా ఇప్పుడు అదే చిత్ర తెలుగు రీమేక్‌లో నటిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top