తాప్సీ లీడ్ రోల్లో 'ఆనందో బ్రహ్మ' | taapsee anandho brahma Motion Poster | Sakshi
Sakshi News home page

తాప్సీ లీడ్ రోల్లో 'ఆనందో బ్రహ్మ'

May 27 2017 3:09 PM | Updated on Sep 5 2017 12:09 PM

తాప్సీ లీడ్ రోల్లో 'ఆనందో బ్రహ్మ'

తాప్సీ లీడ్ రోల్లో 'ఆనందో బ్రహ్మ'

తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమై తరువాత బాలీవుడ్ బాట పట్టిన అందాల భామ తాప్సీ. తెలుగులో గ్లామర్

తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమై తరువాత బాలీవుడ్ బాట పట్టిన అందాల భామ తాప్సీ. తెలుగులో గ్లామర్ రోల్స్తో ఆకట్టుకున్న ఈ బ్యూటి, హిట్ సినిమాల్లో నటించినా.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్లో అడుగుపెట్టి సక్సెస్ సాధించింది. బేబీ, పింక్ సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ సౌత్ ఇండస్ట్రీ మీద కూడా కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది.

అయితే బాలీవుడ్లో కూడా ఫ్లాప్ ఎదురవ్వటంతో ఇప్పుడు మరోసారి టాలీవుడ్ బాట పట్టింది ఈ బ్యూటి. సౌత్లో సక్సెస్ ఫార్ములాగా మారిన హర్రర్ జానర్లో తెరకెక్కిన ఆనందో బ్రహ్మ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ సినిమాలో తాప్సీ చంద్రముఖి తరహా పాత్రలో కనిపించనుందట. మహీ రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రఘు, షకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement