కలయా? నిజామా? గిల్లి చూసుకున్నా! | Sunny Leone Pinched Herself to Believe She is on Shah Rukh Raees Set | Sakshi
Sakshi News home page

కలయా? నిజామా? గిల్లి చూసుకున్నా!

Mar 27 2016 9:24 AM | Updated on Sep 3 2017 8:41 PM

కలయా? నిజామా? గిల్లి చూసుకున్నా!

కలయా? నిజామా? గిల్లి చూసుకున్నా!

కొన్ని కలలు నిజమైన వేళ నమ్మబుద్ధి కాదు. ఎంతగానో తపించే కోరిక నెరవేరితే.. ఇది నిజమా? భ్రమానా? అన్న సందేహం కలుగుతుంది.

కొన్ని కలలు నిజమైన వేళ నమ్మబుద్ధి కాదు. ఎంతగానో తపించే కోరిక నెరవేరితే.. ఇది నిజమా? భ్రమానా? అన్న సందేహం కలుగుతుంది.  అలాంటి సమయంలోనే తమను తాము గిల్లుకొనో.. ఎదుటివారిని గిల్లో.. నిజమని కన్ఫర్మ్‌ చేసుకుంటూ ఉంటాం. తాజాగా బాలీవుడ్ హాట్‌ భామ సన్నీ లియోన్‌ కూడా ఇలాగే తనను పదేపదే గిల్లి చూసుకుంది. నిజమా? కాదా? అని సందేహపడింది. కారణం ఏమిటంటారా? కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌తో కలిసి నటించాలన్న ఆమె కోరిక నెరవేరడమే.

'మస్తీజాదే'తో తాజాగా మస్తీ చేసిన ఈ భామ 'రాయిస్‌' సినిమాతో షారుఖ్‌తో కలిసి ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడుతోంది. తొలిసారి 'రాయిస్‌' సెట్స్‌లోకి అడుగుపెట్టాక.. ఇది కలనా? నిజమా? అని భ్రాంతి కలిగిందంట..  అందుకే 'తొలిరోజు సెట్స్‌లో ఇది నిజమా? కాదా? అన్నది తెలుసుకోవడానికి నన్ను నేను పదేపదే గిల్లి చూసుకోవాలనుకున్నాను. ఇది నిజంగా అమేజింగ్ డే' అంటూ సన్నీ ఆనందం వ్యక్తం చేసింది. 'ప్రార్థించి, కోరి, అకుంఠిత దీక్షతో కష్టపడితే మీ కలలు నిజమవుతాయి. ఈ రోజు రావాలని ఎన్నో ఏళ్లుగా నేను కోరుకున్నాను. ప్రార్థించాను. థాంక్‌ గాడ్‌' అంటూ మరో ట్వీట్‌ చేసింది.

50 ఏళ్ల షారుఖ్ తాజా చిత్రం 'రాయిస్‌' ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్నది. 1980 నాటి 'ఖుర్బానీ' సినిమాలోని 'లైలా ఓ లైలా' పాటను ఈ సినిమా కోసం మళ్లీ వాడుకుంటున్నారు. ఒరిజినల్ ట్రాక్‌లో ఫిరోజ్‌ ఖాన్‌, జీనత్‌ ఆమన్ ఆడిపాడగా.. ఇప్పుడు ఆ ఫేమస్ పాటలో షారుఖ్‌, సన్నీ లియోన్‌ కలిసి చిందులు వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement