నిన్నే చూస్తూ..

 suhasini about ninne chusthu - Sakshi

కథానాయికగా ఓ వెలుగు వెలిగి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారాక కూడా మంచి పాత్రలనే ఎంచుకుంటున్నారు సుహాసిని. ఇటీవల విన్న కథల్లో ‘నిన్నే చూస్తూ’ నచ్చి, ఆ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నూతన నటుడు శ్రీకాంత్‌ హీరోగా, హేమలత (బుజ్జి ) హీరోయిన్‌గా వీరభద్ర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి కె. గోవర్ధన్‌ రావు దర్శకుడు. ఈ చిత్రం మెదటి షెడ్యూల్‌ అమలాపురంలో జరుగుతోంది.

నిర్మాత హేమలతారెడ్డి  మాట్లాడుతూ – ‘‘ఇందులో సుహాసినిగారు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ కథ విని సుహాసినిగారు హిట్‌ మూవీ అవుతుందన్నారు. అలాగే  లేడీ ప్రొడ్యూసర్‌ నిర్మిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని కూడా ఆమె అభినందించారు’’ అన్నారు. ‘‘మంచి కథ, కథనాలు కుదిరాయి’’ అని దర్శకుడు తెలిపారు. భానుచందర్, సన, కాశీ విశ్వనాథ్, రజిత, ‘వెన్నెల’ కిశోర్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రమణ్‌ రాథోడ్‌.

Back to Top