మరో హీరో కొడుకు ఎంట్రీ... | sudheer babu son debuts in fimls, charith maanas, mosagallaku mosagadu | Sakshi
Sakshi News home page

మరో హీరో కొడుకు ఎంట్రీ...

May 22 2015 10:05 AM | Updated on Sep 3 2017 2:30 AM

మరో హీరో కొడుకు ఎంట్రీ...

మరో హీరో కొడుకు ఎంట్రీ...

లుగు తెరకు మరో నట వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ, మేనమామ ప్రిన్స్ మహేష్ బాబు, నాన్న హీరో సుధీర్ బాబు నుంచి నట వారసత్వాన్ని అంది పుచ్చుకుని ఈ బుల్లి నటుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

తెలుగు తెరకు మరో నట వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ, మేనమామ ప్రిన్స్ మహేష్ బాబు, నాన్న హీరో సుధీర్ బాబు నుంచి నట వారసత్వాన్ని అంది పుచ్చుకుని ఈ బుల్లి నటుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  హీరో సుధీర్ బాబు తన పెద్ద కొడుకు చరిత్ మానస్ను వెండితెరకు పరిచయం చేశారు. తన తాజా చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రంలో ఓ చిన్న పాత్రలో చరిత్ నటించినట్లు హీరో సుధీర్ బాబు వెల్లడించారు. క్రైమ్, కామోడీతో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే చరిత్ నటించిన విషయాన్ని సుధీర్ బాబు సినిమా రిలీజ్ అయ్యేవరకూ గోప్యంగా ఉంచటం విశేషం.

'చరిత్ మాసన్కు సినిమాలంటే చాలా ఇంట్రస్ట్, మావాడు చేసే జిమ్నాస్టిక్స్లో కొన్నింటిని నేను కూడా చేయలేను. మామయ్య మహేష్ బాబు సినిమాలో సాంగ్స్కు మూడు, నాలుగు గంటల పాటు అలిసిపోకుండా డాన్స్ కూడా చేస్తారు. ఇక స్కూల్లో అన్నింటిలోనూ ఫస్టే' అని కొడుకు గురించి చెబుతూ సుధీర్ బాబు మురిసిపోతున్నారు. లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్పై రూపొందిన మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో సుధీర్ బాబుకు జంటగా నందిని నటించింది. కాగా మహేష్ బాబు తనయుడు గౌతమ్ '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement