కొత్త తరం ప్రేమకథ

SUDHEER BABU TO ROMANCE ADITI RAO HYDARI - Sakshi

‘జెంటిల్‌మెన్‌’ వంటి హిట్‌ మూవీతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ల కాంబినేషన్‌ మొదలైంది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై మళ్లీ ఇంద్రగంటితో శివలెంక ఓ సినిమా మొదలుపెట్టారు. సుధీర్‌బాబు హీరోగా నటించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్‌లో జరిగాయి. మణిరత్నం ‘చెలియా’ సినిమాలో నాయికగా నటించిన బాలీవుడ్‌ భామ అదితీరావు హైదరీ ఇందులో కథానాయిక. శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘స్క్రిప్ట్‌ చాలా బాగా వచ్చింది.

సుధీర్‌బాబుకి పర్ఫెక్ట్‌ సినిమా అవుతుంది. డిసెంబర్‌ 11 నుంచి షూటింగ్‌ మొదలుపెడతాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మేలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది’’ అన్నారు ఇంద్రగంటి. నరేశ్, తనికెళ్ల భరణి, రోహిణి, నందు, కేదార్‌ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్‌ రామకృష్ణ, శిశిర్‌శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: పీజీ విందా, సంగీతం: వివేక్‌ సాగర్, ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top