తొలి ప్రేయసిని కలిశాను

Sudheer Babu goes for a makeover - Sakshi

బ్యాడ్మింటన్‌ కోర్టులోకి మళ్లీ దిగారు హీరో సుధీర్‌బాబు. సినిమాల్లోకి రాకముందు ఆయన ప్రొఫెషనల్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ అని తెలిసిందే. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, అర్జున, ధ్యాన్‌చంద్, పద్మభూషణ్‌ అవార్డుల గ్రహీత పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆయన అప్పట్లో డబుల్స్‌ విభాగంలో మ్యాచ్‌లు కూడా ఆడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పుల్లెల గోపీచంద్‌పై ఓ బయోపిక్‌ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్‌లో లీడ్‌ రోల్‌ చేయనున్నారు సుధీర్‌బాబు.

ఇందుకోసం ఆయన తిరిగి బ్యాడ్మింటన్‌ కోర్టులో ప్రాక్టీస్‌ స్టార్ట్‌ చేశారు. ప్రాక్టీస్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘తొలిప్రేమ ఎప్పటికీ జీవించే ఉంటుందని అంటుంటారు. నా తొలి ప్రేయసి బ్యాడ్మింటన్‌ గేమ్‌నే. గోపీచంద్‌ బయోపిక్‌ కోసం మళ్లీ సాధన మొదలుపెట్టాను’’ అని పేర్కొన్నారు సుధీర్‌ బాబు. ఈ బయోపిక్‌కు ‘చందమామ కథలు, పీఎస్వీ గరుడవేగ 126.18ఎమ్‌’ ఫేమ్‌ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తారు. త్వరలో షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఈ బయోపిక్‌ రెండు పార్టులుగా విడుదలవుతుందని టాక్‌. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top