కొత్త తరం ప్రేమ

Sudheer Babu, Aditi Rao Hydari New Movie Launch  - Sakshi

సుధీర్‌బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు, రచయిత తనికెళ్ల భరణి క్లాప్‌ ఇచ్చారు. నటుడు అవసరాల శ్రీనివాస్‌ గౌరవ దర్శకత్వం వహించారు. మణిరత్నం ‘చెలియా’ ఫేమ్‌ అదితిరావు హైదరీ ఇందులో సుధీర్‌బాబుకి జోడీగా నటిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 23 వరకు ఫస్ట్‌ షెడ్యూల్‌ జరుగుతుంది.

జనవరి 2 నుంచి 10 వరకు, 20 నుంచి ఫిబ్రవరి 8 వరకు హైదరాబాద్‌లోనే షూటింగ్‌ చేస్తాం. ఆ తర్వాత హిమాచల్‌ ప్రదేశ్, ముంబైలో షూటింగ్‌ జరపనున్నాం. మేలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. కొత్త తరం ప్రేమకథతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి. నరేశ్, తనికెళ్ల భరణి, నందు, రాహుల్‌ రామకృష్ణ, హరితేజ, పవిత్ర లోకేష్, హర్షిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్‌ సాగర్, కో డైరెక్టర్‌: కోట సురేశ్‌ కుమార్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top