బన్నీ కోసం మరో కాస్ట్లీ టెక్నీషియన్ | Sudeep Chatterjee Cinematography for DJ Duvvada Jagannadam | Sakshi
Sakshi News home page

బన్నీ కోసం మరో కాస్ట్లీ టెక్నీషియన్

Oct 16 2016 12:36 PM | Updated on Sep 4 2017 5:25 PM

బన్నీ కోసం మరో కాస్ట్లీ టెక్నీషియన్

బన్నీ కోసం మరో కాస్ట్లీ టెక్నీషియన్

ప్రతీ సినిమాకు తన స్థాయిని మరింత పెంచుకుంటున్న పోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాల మేకింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుసగా 50 కోట్ల సినిమాలతో దూసుకుపోతున్న...

ప్రతీ సినిమాకు తన స్థాయిని మరింత పెంచుకుంటున్న పోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాల మేకింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుసగా 50 కోట్ల సినిమాలతో దూసుకుపోతున్న బన్నీ, అందుకు తగ్గట్టు నేషనల్ లెవల్ టెక్నీషియన్స్తో పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. భారీ రెమ్యూనరేషన్లు ఆఫర్ చేసి మరి బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్లను తన సినిమాలకు తీసుకుంటున్నాడు.

ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సరైనోడు సినిమా కోసం సినిమాటోగ్రఫర్గా రిషీ పంజాబిని తీసుకువచ్చిన బన్నీ, తన నెక్ట్స్ సినిమాకు కూడా నార్త్ కెమరామేన్నే తీసుకున్నాడు. గుజారిష్, చక్ దే ఇండియా లాంటి విజువల్ ట్రీట్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ సుదీప్ చటర్జీ.., బన్నీ, హరీష్ శంకర్ల సినిమాకు పనిచేయనున్నాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న కాబిల్ సినిమాకు వర్క్ చేస్తున్నాడు సుదీప్. బన్నీ సినిమా కోసం సుధీప్ భారీ మొత్తాన్నే రెమ్యూరేషన్గా అందుకోనున్నాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement