‘నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి’

Sonali Bendre Husband Shares Their Son Photo That Says Sonali Is Doing Well - Sakshi

ప్రముఖ నటి సొనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికపుడు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. చికిత్సలో భాగంగా జుట్టు కత్తిరించుకున్న సమయంలో భావోద్వేగానికి గురైన సొనాలి.. తన కొడుకు రణ్‌వీర్‌, ఇతర కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యంతో క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడుతున్నానని పేర్కొన్నారు.

తాజాగా సొనాలి ఆడపడుచు సృష్టి ఆర్య మీడియాతో మాట్లాడుతూ..‘సొనాలి చాలా ధైర్యంగా ఉన్నారు. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటారంటూ’  తెలిపారు. ఈ మాటలు నిజం కావాలంటూ సొనాలి భర్త గోల్డీ బేల్‌.. రణ్‌వీర్‌ నవ్వుతూ ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫొటోను చూసిన సొనాలి అభిమానులు.. రణ్‌వీర్‌.. నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని, మీ అమ్మకు ఆ దేవుడి దీవెనలు కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయని బెస్ట్‌ విషెస్‌ చెబుతున్నారు.

IDK

A post shared by rockbehl (@rockbehl) on

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top