సోషియో ఫాంటసీ... | Socio-fantasy | Sakshi
Sakshi News home page

సోషియో ఫాంటసీ...

Jan 17 2016 11:51 PM | Updated on Apr 3 2019 9:11 PM

సోషియో ఫాంటసీ... - Sakshi

సోషియో ఫాంటసీ...

అలానాటి అందాల తార, సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్, మిస్తీ చక్రవర్తి జంటగా

అలానాటి అందాల తార, సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్, మిస్తీ చక్రవర్తి జంటగా రూపొందుతోన్న చిత్రం ‘శరభ’. కేఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నరసింహారావు ఎన్. దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహాదేవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘108 నరసింహ స్వామి పుణ్యక్షేత్రాల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని ఆరంభించడం విశేషం. నటీ నటులు, సాంకేతిక వర్గం చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభమైంది.
 
 ప్రముఖ దర్శకులు ఎన్.శంకర్ వద్ద 20 ఏళ్లు కో-డెరైక్టర్‌గా పనిచేసిన నరసింహారావు చెప్పిన కథ నచ్చడంతో, ఆయన డెరైక్షన్ లో ఈ చిత్రం నిర్మిస్తున్నా. ఇదొక సోషియో ఫాంటసీ చిత్రం’’ అన్నారు. ‘‘నరసింహ స్వామి చరిత్రలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నాం. ఈ నెల 21న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రమణ సాల్వ, సంగీతం: కోటి, కో ప్రొడ్యూసర్: సురేష్ కపాడియా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement