శ్రుతి రీఎంట్రీ.. వాటే స్టంట్స్‌.. | Shruti Haasan Re-enty To Tollywood | Sakshi
Sakshi News home page

శ్రుతి రీఎంట్రీ.. వాటే స్టంట్స్‌..

Oct 30 2019 5:58 PM | Updated on Oct 30 2019 6:32 PM

Shruti Haasan Re-enty To Tollywood - Sakshi

హైదరాబాద్‌: విలక్షణ నటుడు క‌మ‌ల్ హాసన్‌ తనయ శ్రుతి హాస‌న్ మ‌ళ్ళీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.  మైఖేల్ కోర్సెల్ అనే వ్య‌క్తితో ప్రేమలో మునిగితేలిన శ్రుతి దాదాపు రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరి మధ్య అనుబంధానికి బ్రేక్‌ పడటంతో శ్రుతి మళ్లీ సినిమాల మీద ఫోకస్‌ చేస్తున్నారు.  విజయ్‌ సేతుపలి సరసన ‘లాభం’ సినిమాలో నటిస్తున్న ఆమె తాజాగా తెలుగులో మరో సినిమాకు కమిట్‌ అయ్యారు. మాస్‌ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు మలినేని గోపీచంద్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో శ్రుతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇది రవితేజ 66వ సినిమా. దీనిని నిర్మాత బీ మధు నిర్మిస్తుండగా.. ఇందులో శ్రుతి నటిస్తున్న విషయాన్ని కన్‌ఫర్మ్‌ చేస్తూ చిత్ర యూనిట్‌ ట్వీట్‌ చేసింది.

వాటే స్టంట్స్‌..!
ఇక, రైతు సమస్యలు నేపథ్యంగా తెరకెక్కుతున్న ‘లాభం’ సినిమాలో విజయ్‌ సేతుపతితో శృతి రొమాన్స్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాట కోసం శ్రుతి అద్భుతమైన స్టంట్స్‌ చేసినట్టు తెలుస్తోంది. శ్రుతి చేసిన విన్యాసాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్‌ ఆమెను ప్రశంసల వర్షంలో ముంచెత్తున్నారు. ‘లాభం’. చిత్రాన్ని ఆరుముగ కుమార్‌తో కలిసి విజయ్‌ సేతుపతి స్వయంగా నిర్మించారు. ఇందులో ఆయన రైతు నేతగా నటిస్తున్నారు. ఇక, అమెరికాకి చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శ్రుతి  కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement