దేవదాసులు

 Shah Rukh Khan Visits Dilip Kumar - Sakshi

బాలీవుడ్‌ స్పైస్‌

ఒకే ఫ్రేమ్‌లో అలనాటి దేవదాస్‌ దిలీప్‌ కుమార్, ఈనాటి దేవదాస్‌ను షారుక్‌ ఖాన్‌ను చూస్తుంటే చాలా బావుంది కదా. దిలీప్‌ కుమార్, షారుక్‌ ఖాన్‌ ఎంత సన్నిహితంగా ఉంటారో తెలిసిన విషయమే. ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫెస్టివల్స్‌ను ఈ ఇద్దరూ కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. నైన్‌టీస్‌ సూపర్‌ స్టార్‌ దిలీప్‌ కుమార్‌ ఇటీవల డీహైడ్రేషన్‌ మరియు యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్‌ అయి, చికిత్స అనంతరం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలుసుకున్న షారుక్‌ వెంటనే దిలీప్‌ కుమార్‌ను ఆయన స్వగృహంలో కలిసి, టైమ్‌ స్పెండ్‌ చేశారు. ఆ సందర్భంలో దిగిన ఈ ఫొటోని దిలీప్‌కుమార్‌ తన ట్విట్టర్‌లో పంచుకున్నారు.

Back to Top