సాయేషా పారితోషికానికి రెక్కలు

Sayesha Demanding Huge Remuneration For Next - Sakshi

తమిళసినిమా: నటి సాయేషా సైగల్‌ గురించి ఇప్పుడు పరిచయ వ్యాఖ్యలు అవసరం ఉండదనుకుంటా. దివంగత ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్‌కుమార్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలీవుడ్‌ బ్యూటీ ఈ భామ. మొదట టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరిక్షించుకుని అక్కడ కలిసి రాకపోవడంతో కోలీవుడ్‌పై కన్నేసింది.

దర్శకుడు విజయ్‌దృష్టిలో పడి వనయుద్ధం చిత్రంలో లక్కీ నటుడు జయంరవితో రొమాన్స్‌ చేసింది.ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా సాయేషాసైగల్‌కు మాత్రం మంచి లిఫ్ట్‌ ఇచ్చింది. డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవా వంటి వాళ్లు ఈ అమ్మడి డాన్స్‌కు గులామ్‌ అవడంతో మౌత్‌ పబ్లిసిటీ పెరిగిపోయింది. దాన్ని సాయోషా బాగానే వాడుకుందనాలి.

ఆ తరువాత కార్తీకి జంటగా నటించిన కడైకుట్టి సింగం మంచి విజయం సాధించడం, అదే విధంగా ఆర్యతో నటించిన గజనీకాంత్, విజయ్‌సేతుపతి సరసన నటించిన జుంగా చిత్రం సక్సెస్‌ అనిపించుకున్నాయి. అలా సక్సెస్‌ఫుల్‌ కథానాయకిగా ముద్ర పడడంతో సూర్య హీరోగా నటిస్తున్న భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది.

దీంతో ఇప్పటి వరకూ పారితోషికం విషయంలో మెతక వైఖరిని ప్రదర్శించిన సాయేషా కూడా చాలా మంది తారల మాదిరిగానే పారితోషికం విషయంలో డిమాండ్‌ చే స్తుందనే ప్రచారం వైరల్‌ అవుతోంది.ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఏకంగా రూ.2 కోట్లకు పెంచేసిందట. అంతేకాకుండా ఇటీవల వదంతులకు, విమర్శలకు గురవుతోందన్నది గమనార్హం.

సమీప కాలంలో తన పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో సినీ సన్నిహితులకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో నటుడు ప్రభుదేవా, ఆర్య లాంటి స్టార్‌ హీరోలు పాల్గొన్నారు. ఇదే పార్టీలో పాల్గొన్న ఒక స్టార్‌ హీరో నటుడు మద్యం మత్తులో వేగంగా కారు డ్రైవ్‌ చేసి యాక్సిడెంట్‌ చేసిన సంఘటన మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఇకపోతే నటి సాయేషా ప్రభుదేవాతో సన్నిహితంగా ఉంటోందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మరి ఈ వార్తలపై నటి సాయేషా ఎలా స్పందిస్తుందో చూడాలి. అయినా దక్షిణాది హీరోయిన్లే ఇలాంటి వాటికి భేఖాతరు చేస్తారు. అలాంటిది ఈ బాలీవుడ్‌ భామ ఖాతరు చేస్తుందా?

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top