నా నమ్మకం నిజమైంది

నారా రోహిత్, నందిత జంటగా విజన్ ఫిలిం మేకర్స్ పతాకంపై పవన్ సాదినేని దర్శకత్వంలో డా. వీబీ రాజేంద్రప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సావిత్రి’. చిత్ర విజయోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. నారా రోహిత్ మాట్లాడుతూ -‘‘ ‘సోలో’ తర్వాత నా కెరీర్‌లో ‘సావిత్రి’ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిపోతుందన్న నా నమ్మకం నిజమైంది’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘హీరో, హీరోయిన్ల మధ్య సాగే ప్రేమకథకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాకు హైలైటైంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు ఎమోషనల్ సీన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు’’ అని నిర్మాత తెలిపారు. ఈ వేడుకలో నందిత, ప్రభాస్ శ్రీను, ‘సత్యం’ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి