అదేరోజు మళ్లీ వస్తున్న గబ్బర్సింగ్ | sardar gabbarsing release date confirmed may 11 | Sakshi
Sakshi News home page

అదేరోజు మళ్లీ వస్తున్న గబ్బర్సింగ్

Dec 27 2015 3:47 PM | Updated on Oct 30 2018 5:58 PM

అదేరోజు మళ్లీ వస్తున్న గబ్బర్సింగ్ - Sakshi

అదేరోజు మళ్లీ వస్తున్న గబ్బర్సింగ్

చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానుల కోరిక తీరే రోజు దగ్గరకొచ్చింది.

చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానుల కోరిక తీరే రోజు దగ్గరకొచ్చింది. ఇప్పటి వరకు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వని యూనిట్ తాజాగా సినిమా రిలీజ్పై ఓ నిర్ణయం తీసుకుందన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా జనవరిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినా, షూటింగ్ లేటు కావటంతో వాయిదా పడింది. ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్లో సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించిన యూనిట్ అందుకు తగ్గట్టుగా ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తోంది.

సర్దార్ గబ్బర్సింగ్ రిలీజ్ కోసం ముహుర్తం కూడా ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మూడేళ్ల క్రితం గబ్బర్సింగ్ సినిమా రిలీజ్ అయిన సంచలనాలు నమోదు చేసిన మే 11న సర్థార్ గబ్బర్సింగ్ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు గబ్బర్సింగ్ సీక్వెల్గా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే పవన్ సత్తా చాటుతాడని నమ్ముతున్నారు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. పవర్ ఫేం బాబి (కెయస్ రవీంద్ర) దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement