తెలుగు పలుకులు

Sammohanam is a coming together of two worlds - Sakshi

అదితీరావు హైదరీ.. పేరుకు బాలీవుడ్‌ కథానాయిక అయినా తెలుగు మూలాలున్న అమ్మాయే. మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా తెలుగులో తొలిసారి ‘సమ్మోహనం’ చిత్రంలో నటిస్తున్నారు. తొలి సినిమాకే తెలుగు నేర్చుకుని తన పాత్రకు అదితీ డబ్బింగ్‌ చెబుతుండటం విశేషం. సుధీర్‌బాబు, అదితీరావు జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తోన్న ‘సమ్మోహనం’ జూన్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ –‘‘ఇంద్రగంటి ఎప్పుడూ దాదాపుగా తెలుగమ్మాయిలనే హీరోయిన్లుగా ఎంపిక చేసుకుంటారు. అదితీరావు హైదరి తెలుగు మూలాలున్న అమ్మాయి. మా సినిమా కోసం తెలుగు నేర్చుకుని, సొంతంగా డబ్బింగ్‌ చెబుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘కొత్త ఎత్తుగడ, కొత్త పోకడ ఉన్న నవతరం కథ ‘సమ్మోహనం’. రొమాన్స్, హాస్యం సమ్మిళితమై ఉంటాయి. మంచి కథ, కథనానికి  చక్కటి నిర్మాణ విలువలు తోడయ్యాయి. టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా మొత్తం అందమైన ఫీల్‌ క్యారీ చేశాం’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం:  వివేక్‌ సాగర్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top