యూ టర్న్‌ గీతాలు రెడీ

Samantha U Turn Music Album Ready For Out - Sakshi

తమిళసినిమా: సెలబ్రిటీస్‌ చిత్ర వివరాలను తెలుసుకోవడానికి వారి అభిమానులు ఆసక్తి కనబరుస్తుంటారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా ఆ కోవలోకి చేరిన నటి సమంత. వివాహనంతరం అగ్రనటిగా కొనసాగుతున్న అరుదైన హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. అంతే కాదు ఇప్పటి వరకూ హీరోలతో నాలుగు ప్రేమ సన్నివేశాలు, నాలుగు పాటలు అంటూ నటించేసిన సమంత వివాహానంతరం హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నాయకిగా మారింది. అవును సమంత ప్రస్తుతం నటిస్తున్న యూ టర్న్‌ చిత్రం ఆ తరహా హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రమే. కన్నడంతో సంచలన విజయం సాధించిన యూటర్న్‌ చిత్రాన్ని అదే పేరుతో సమంత హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

ఇందులో ఈ బ్యూటీ మరోసారి పాత్రికేయురాలిగా నటిస్తోంది. ఇప్పటికే మహానటి చిత్రంలో విలేకరిగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. షూటింగ్‌ పూర్తి చేసుకున్న యూ టర్న్‌ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. తాజాగా ఈ చిత్ర గీతాలను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నట్లు నటి సమంత తన ట్విట్టర్‌లో పేర్కొంది. యూ టర్న్‌ చిత్రం విడుదలైన వారంలోనే శివకార్తికేయన్‌తో సమంత నటించిన సీమరాజా చిత్రం తెరపైకి రానుంది. ప్రస్తుతం సమంత విజయ్‌సేతుపతితో సూపర్‌ డీలక్స్‌ చిత్రంలో  రొమాన్స్‌ చేస్తోంది. అదే విధంగా తెలుగులో భర్త నాగచైతన్యకు జంటగా ఒక చిత్రంలోనూ నటిస్తోంది. ఆ తరువాత ఒక కొరియా చిత్ర రీమేక్‌లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. విశేషం ఏమింటంటే ఇందులో సమంత 80 బామ్మగా కనిపించనుందట. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇలా నటనకు అవకాశం ఉన్న అదే సమయంలో వ్యత్యాసంతో కూడిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ సమంత తన నట దాహాన్ని తీర్చుకుంటోందన్న మాట.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top