వైరల్‌గా సమంత ‘కర్మ థీమ్‌’ చాలెంజ్‌

Samantha U Turn Dance Challenge Goes Viral - Sakshi

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలెంజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. మొన్నటి వరకు ఫిట్‌నెస్‌, కికీ తదితర చాలెంజ్‌లతో నిండిపోయిన సోషల్‌ మీడియాకు.. క్రేజీ నటి సమంత సరికొత్త చాలెంజ్‌ను పరిచయం చేశారు. తన అప్‌కమింగ్‌ మూవీ ‘యూటర్న్‌’  ప్రమోషన్‌లో భాగంగా.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ రూపొం‍దించిన కర్మ థీమ్‌లో డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన సమంత #యూటర్న్‌డాన్స్‌చాలెంజ్‌ పేరిట సవాల్‌ విసిరారు.

సమంతపై ఆప్యాయత, అనురాగాలు కురిపించే ఆమె మరిది అఖిల్‌ అక్కినేని మొదటగా ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. ఆ తర్వాత హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి, నవీన్‌ చంద్రతో పాటుగా సమంత అభిమానులందరూ ఈ చాలెంజ్‌ను స్వీకరించడంతో.. యూటర్న్‌కర్మథీమ్‌ చాలెంజ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘యూటర్న్‌’ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌తోనే అంచనాలను పెంచేసిన ఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌ భూమిక కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌లు ఇతర పాత్రల్లో కన్పించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top