సమంతను వరించిన అదృష్టదేవత | Samantha to act with Vikram in 'Paththu Ennarathukulla | Sakshi
Sakshi News home page

సమంతను వరించిన అదృష్టదేవత

Jun 25 2014 11:31 PM | Updated on Sep 2 2017 9:23 AM

అదృష్టం వచ్చిందంటే దాన్నెవరూ అడ్డుకోలేరు. అలాంటి అదృష్టదేవత పూర్తిగా నటి సమంతను వరించేసిందని చెప్పవచ్చు. ఈ చెన్నై చిన్నదానికి అటు టాలీవుడ్‌లో చూస్తే విజయాలపై

అదృష్టం వచ్చిందంటే దాన్నెవరూ అడ్డుకోలేరు. అలాంటి అదృష్టదేవత పూర్తిగా నటి సమంతను వరించేసిందని చెప్పవచ్చు. ఈ చెన్నై చిన్నదానికి అటు టాలీవుడ్‌లో చూస్తే విజయాలపై విజయాలు వచ్చి పడుతున్నాయి. ఇటు కోలీవుడ్‌లో పరికిస్తే అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇంత సుడి గల నటిని ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదు. తెలుగులో మనం చిత్రం విజయంతో సంతోష సాగరంలో తేలియాడుతున్న సమంతకు తమిళంలో మరో భారీ అవకాశం వెతుక్కుంటూ వచ్చినట్లు సమాచారం.
 
 కోలీవుడ్‌లో ఒక్క హిట్ కూడా బోణీ కొట్టని ఈ లక్కీగర్ల్ ఇక్కడ, ఇప్పుడు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలతో వరుసగా నటించేస్తోంది. వాటి లో విజయ్ సరసన కత్తి చిత్రం ఒకటి. క్రేజీ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, ఇళయదళపతి అభిమానుల కోసం పదునుపెడుతున్న కత్తి ఇది. వీరి కాంబినేషన్‌లో తుపాకి తరువాత వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. సమంత నటిస్తున్న మరో మాస్ ఎంటర్ టైనర్ చిత్రం అంజాన్. సక్సెస్‌ఫుల్ దర్శకుడు లింగుస్వామి నటుడు సూర్యను సరికొత్త కోణం లో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతు న్నాయి. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. దీంతోపాటు
 
 బబ్లీగర్ల్ సమంత ముచ్చటగా మూడోస్టార్ హీరో విక్రమ్‌తో జతకడుతున్న చిత్రం ‘పత్తు ఎండ్రదు కుళ్లే’ ప్రముఖ ఛాయా గ్రాహకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పక్తు కమర్షియల్ కథా చిత్రమేనంటున్నారు. తాజాగా సమంతపై మరోస్టార్ హీరో అజిత్ కన్ను పడిందంటున్నారు. ఇటీవల వరుసగా ఆరంభం, వీరం చిత్రాల విజయాలతో జోష్‌లో వున్న అజిత్ ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత అజిత్ వీరం ఫేమ్ శివ దర్శకత్వంలో మరోసారి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
 ఈ చిత్రంలో సమంతనే హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు శివ ఆస్థాన హీరోయిన్ తమన్న. ఆయన ఇంతకుముందు రూపొందించిన చిరుతై, వీరం చిత్రాల్లో తమన్ననే హీరోయిన్. అయితే ఈసారి సమంతను ఎంపిక చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే తన తాజా చిత్ర వివరాలను తెలపడానికి ఇంకా చాలా సమయం ఉందంటున్నారు దర్శకుడు శివ. లక్కీస్టార్ సమంత మాత్రం త్వరలోనే తాను మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నట్లు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి బోలెడు ఆసక్తికి తెరలేపింది. ఏదేమైనా ఈ బ్యూటీ సూర్యతో జత కట్టిన అంజాన్ చిత్రం జూలై ఐదున విడుదల కానుంది. ఈ చిత్రం రిజల్ట్ కోసం ఈ క్రేజీ హీరోయిన్ ఎంతగానో ఎదురు చూస్తోంది. అదృష్టమంటే అదే కదా మరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement