శూర్పణఖ పాత్రలో సమంత

Samantha In A Mythological Role Soorpanaka - Sakshi

టాలీవుడ్ లో టాప్‌ స్టార్‌గా వెలుగొందుతున్న స్టార్ హీరోయిన్‌ సమంత ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరుకు సోషల్‌ సినిమాలు మాత్రమే చేసిన సామ్‌ త్వరలో ఓ పౌరాణిక పాత్రలో నటించేందుకు ఓకె చెప్పారట. అది కూడా నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో అని తెలుస్తోంది.

పలు యానిమేషన్‌ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్‌.. రామాయణం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. శూర్పణఖ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సమంత లీడ్‌ రోల్‌లో నటించనున్నారు. ముందుగా ఈ పాత్రకు కాజల్‌ను తీసుకోవాలని భావించినా ప్రస్తుతం సమంత పేరును పరిశీలిస్తున‍్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top