యూ టర్న్‌కు రెడీ

Samantha Akkineni to star in Tamil and Telugu remakes of U-Turn - Sakshi

అదో ఫ్లై ఓవర్‌. అక్కడ ఎవరైతే డివైడర్స్‌ని తొలగించి మరీ యూ టర్న్‌ తీసుకుంటారో వాళ్లు అవుట్‌. గేమ్‌లో నుంచి కాదు లైఫ్‌లో నుంచి. కాపాడాలని చూసినా, తప్పించుకోవాలని ట్రై చేసినా ఆ ట్రయల్స్‌ అన్నీ వేస్ట్‌. డెత్‌ బెల్‌ మోగడం ఖాయం. ఎందుకలా? ఈ మిస్టరీ ఏంటీ? అన్న ప్రశ్నలకు.. రెండేళ్ల క్రితం కన్నడంలో వచ్చిన ‘యూ టర్న్‌’ చిత్రాన్ని చూసినవారికి సమాధానాలు తెలిసే ఉంటాయి.

శ్రద్ధా శ్రీనాథ్, రాధిక చేతన్, దిలీప్‌ రాజ్‌ ముఖ్య తారలుగా పవన్‌ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఇది. ఈ సినిమాను ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేయనున్నారు. సమంత లీడ్‌ రోల్‌లో నటిస్తారు. ‘‘పవన్‌కుమార్‌ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ తమిళ, తెలుగు భాషల్లో ‘యూ టర్న్‌’ సినిమాను నిర్మించనుంది. వచ్చే నెలలో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అని పేర్కొన్నారు సమంత. ఆమె తెలుగులో నటిస్తున్న ‘రంగస్థలం, మహానటి’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top