సల్మాన్ సినిమాలో చైనా హీరోయిన్ | Salman Khan Tubelight Movie Heroine is Zhu Zhu | Sakshi
Sakshi News home page

సల్మాన్ సినిమాలో చైనా హీరోయిన్

Aug 12 2016 10:27 AM | Updated on Sep 4 2017 9:00 AM

సల్మాన్ సినిమాలో చైనా హీరోయిన్

సల్మాన్ సినిమాలో చైనా హీరోయిన్

వరుస సూపర్ హిట్స్తో బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్ మరో ఇంట్రస్టింగ్ సినిమాను మొదలు పెట్టాడు. సుల్తాన్ సక్సెస్ జోష్ను ఎంజాయ్ చేస్తూనే కొత్త సినిమా పనుల్లో బిజీగా అవుతున్నాడు. తనతో...

వరుస సూపర్ హిట్స్తో బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్ మరో ఇంట్రస్టింగ్ సినిమాను మొదలు పెట్టాడు. సుల్తాన్ సక్సెస్ జోష్ను ఎంజాయ్ చేస్తూనే కొత్త సినిమా పనుల్లో బిజీగా అవుతున్నాడు. తనతో ఏక్తాటైగర్, భజరంగీ బాయిజాన్ లాంటి వరుస హిట్స్ అందించిన కబీర్ ఖాన్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు.

ఈ  సినిమాకు ట్యూబ్ లైట్ అనే ఆసక్తికరమైన టైటిల్ను నిర్ణయించారు చిత్రయూనిట్. టైటిల్ విషయంలోనే కాదు నటీనటుల ఎంపికలోనూ అదే కొత్త దనాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నారు ట్యూబ్లైట్ యూనిట్. ఈ సినిమాలో సల్మాన్ సరసన ఝూ ఝూ అనే చైనా అమ్మాయి హీరోయిన్గా నటించనుంది. చైనాలో ఎంటివి యాంకర్గా పరిచయం అయి తరువాత పలు అంతర్జాతీయ సినిమాల్లో నటించిన ఝూ ఝూను హీరోయిన్గా తీసుకోవటం బాలీవుడ్ సర్కిల్స్లో కూడా ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఇండియాలో భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్న నిర్మాతలు చైనా మార్కెట్ను టార్గెట్ చేస్తున్నారు. అమీర్ ఖాన్ పికెతో పాటు, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కూడా చైనాలో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. అదే బాటలో సల్మాన్ కూడా చైనా మార్కెట్ మీద కన్నేశాడు. అందుకే చైనీస్ భామ హీరోయిన్ అయితే చైనా మార్కెట్లో సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది ఈ ప్లాన్ చేశాడట. సల్మాన్ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement