ఆమె నా ఫేవరెట్‌: సల్మాన్‌ఖాన్‌ | Salman Khan Shares Details About Lara Duttas Hundred Web Series | Sakshi
Sakshi News home page

తన పార్ట్‌నర్‌కి తోడుగా సల్మాన్‌

Apr 24 2020 7:39 PM | Updated on Apr 24 2020 7:39 PM

Salman Khan Shares Details About Lara Duttas Hundred Web Series - Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా  ఇంట్లో ఉంటున్న వారికి వెబ్‌సిరీస్‌లు ఊరటనిస్తోన్నాయి. రోజు రోజుకి వెబ్‌సిరీస్‌ల హవా పెరుగుతోంది. దీంతోచాలా మంది సినీ ప్రముఖులు కూడా వెబ్‌సిరీస్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఒక్కప్పటి హీరోయిన్లు కూడా ప్రధానంగా వెబ్‌సిరీస్లనే ఎంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ భామ లారాదత్తా కూడా వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వబోతుంది. హండ్రెడ్‌ పేరుతో హాట్‌స్టార్‌లో ఇది ప్రసారం కాబోతుంది. దీనికి సంబంధించి అఫిషియల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

దీని గురించి బాలీవుడ్‌ స్టార్స్‌ చాలా మంది ప్రచారం చేశారు. ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తన పార్టనర్‌కు సపోర్ట్‌గా ముందుకొచ్చాడు. ఈ సిరీస్‌లో లారాదత్తా, రింకు రాజ్‌గురూ కూల్‌గా కనిపిస్తోన్న పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. పార్ట్‌నర్‌ సినిమా నుంచి నా ఫేవరెట్‌ హీరోయిన్‌. నా ఫ్యాన్స్‌ అందరూ ఈ సిరీస్‌ చూడండి అంటూ అందులో పేర్కొన్నాడు. దీనికి తోడు హండ్రెడ్‌ ట్యాగ్‌లైన్‌ దో కిలాడీ ,ప్రాబ్లమ్‌ భారీ ( ఇద్దరు కిలాడీలు, పెద్ద సమస్య) అనే ట్యాగ్‌లైన్‌ను కూడా సల్మాన్‌ జత చేశాడు.ఈ వెబ్‌ సిరీస్‌ హాట్‌స్టార్‌లో ఈ నెల 25 నుంచి ప్రసారం కాబోతుంది. ఈ పోస్ట్‌కి లారా దత్తా కూడా పార్టనర్‌ అని కామెంట్‌ పెట్టి సల్మాన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. సల్మాన్‌ ఫ్యాన్స్‌ కూడా పార్టనర్‌ సినిమాను గుర్తు తెచ్చుకొని రీఫ్రెష్‌ అవుతున్నారు.  సల్మాన్, లారాదత్తా కలసి పార్టనర్‌ సినిమాలో నటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement