సల్లూ భాయ్ పక్కా ప్లానింగ్! | Salman Khan is the proper planning! | Sakshi
Sakshi News home page

సల్లూ భాయ్ పక్కా ప్లానింగ్!

Jun 25 2015 12:14 AM | Updated on Apr 3 2019 6:23 PM

సల్లూ భాయ్ పక్కా ప్లానింగ్! - Sakshi

సల్లూ భాయ్ పక్కా ప్లానింగ్!

ప్లానింగ్ విషయంలో బాలీవుడ్ వాళ్లు చాలా పక్కాగా ఉంటారు. సినిమా స్టార్ట్ చేయకముందే, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేంత పక్కా ప్లానింగ్ ఉంటుంది వాళ్ల దగ్గర.

ప్లానింగ్ విషయంలో బాలీవుడ్ వాళ్లు చాలా పక్కాగా ఉంటారు. సినిమా స్టార్ట్ చేయకముందే, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేంత పక్కా ప్లానింగ్ ఉంటుంది వాళ్ల దగ్గర. సల్మాన్‌ఖాన్ అయితే ఈ విషయంలో మరీ పర్‌ఫెక్ట్. ఇందుకు తాజా ఉదాహరణ ఆయన నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్’.
 
 ఈ చిత్రాన్ని రంజాన్‌కి రిలీజ్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేసేశారు. తాజాగా యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సల్మాన్ హీరోగా అలీ అబ్బాస్ ఖాన్ తెరకెక్కించనున్న చిత్రం ‘సుల్తాన్’. ఈ సినిమా షూటింగే ఇంకా మొదలు కాలేదు.
 
 అప్పుడే సల్మాన్ ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం రంజాన్‌కు విడుదల చేస్తామని ప్రకటించేశారు. దీపికా పదుకొనే కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో సల్మాన్ రెజ్లర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్రలో తనదైన శైలిలో ఒదిగిపోవడానికి సిద్ధమైపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement