సల్మాన్‌, కత్రినా, రణ్‌వీర్‌లపై దావా

Salman Khan And Katrina Kaif sued in US - Sakshi

ఇల్లినాయిస్‌, అమెరికా : సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, సోనాక్షి సిన్హా, రణ్‌వీర్‌ సింగ్‌, ప్రభుదేవా, అక్షయ్‌ కుమార్‌లపై అమెరికాలో భారతీయ అమెరికన్‌ ప్రమోటర్‌ కంపెనీ దావా వేసింది. డబ్బు తీసుకుని కన్సర్ట్‌లో పాల్గొనడానికి నటీనటులు నిరాకరిస్తున్నారని దావాలో పేర్కొంది.

చికాగోకు చెందిన వైబ్రంట్‌ మీడియా గ్రూప్‌ ఇల్లినాయిస్‌ కోర్టులో దావాను వేసింది. వైబ్రంట్‌ మీడియా వేసిన దావాలో నటీనటులు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, సోనాక్షి సిన్హా, రణ్‌వీర్‌ సింగ్‌, ప్రభుదేవా, అక్షయ్‌ కుమార్‌, సింగర్లు ఉదిత్‌ నారాయణ్‌, ఆల్కా యాజ్ఞిక్‌, ఉషా మంగేష్కర్‌లు, మాట్రిక్స్‌ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, యాష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు కాంట్రాక్టును ఉల్లంఘించాయని పేర్కొంది.

సల్మాన్‌తో మిగిలిన ఆర్టిస్టులు తమతో ఒప్పందం కుదుర్చుకుని వేరే ప్రమోటర్‌తో కన్సర్ట్‌ చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలిసిందని పిటిషన్‌లో వైబ్రంట్‌ మీడియా వెల్లడించింది. తమకు నష్టపరిహారంగా 1 మిలియన్‌ డాలర్లు ఇప్పించాలని కోర్టును కోరింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top