తెరపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కథ | Ryan Gosling eyed for Neil Armstrong in biopic from Damien Chazelle | Sakshi
Sakshi News home page

తెరపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కథ

Dec 1 2015 11:50 PM | Updated on Sep 3 2017 1:19 PM

తెరపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కథ

తెరపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కథ

చంద్రమండలానికి మనుషులు వెళ్లడమా? అసాధ్యం... కలలో కూడా ఊహించలేం అనుకుంటున్న రోజుల్లో, దాన్ని నిజం చేశారు అమెరికా వ్యోమగామి ‘నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్’.

చంద్రమండలానికి మనుషులు వెళ్లడమా? అసాధ్యం... కలలో కూడా ఊహించలేం అనుకుంటున్న రోజుల్లో, దాన్ని నిజం చేశారు అమెరికా వ్యోమగామి ‘నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్’. 1969 జూలై 20న చంద్రమండలంపై కాలుమోపిన తొలి వ్యక్తుల్లో ఒకరిగా ప్రపంచం విస్తుపోయేలా చేశారాయన. అంతరిక్ష పరిశోధనా చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలికిన రోజు అది. ‘అపోలో 11’ అనే అంతరిక్ష నౌక ద్వారా చంద్రమండలంపై  తొలిసారిగా కాలు మోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవితాన్ని ‘ఫస్ట్ మ్యాన్’  టైటిల్‌తో  వెండితెరపై ఆవిష్కరించడానికి హాలీవుడ్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి.

జేమ్స్ హాన్సన్ రాసిన ‘ఫస్ట్ మ్యాన్: ఎ లైఫ్ ఆఫ్ నీల్ ఎ ఆర్మ్‌స్ట్రాంగ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ ఏడాది మూడు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న ‘విప్‌లాష్’ చిత్ర దర్శకుడు డేమియన్ చెజేల్  దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. నటుడు రయాన్ గాస్లింగ్  ఇందులో నీల్  ఆర్మ్ స్ట్రాంగ్ పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement