ఎంతవారులైన గాని వేదాంతులైన గాని.. | Rowdy Fellow movie, Nara Rohit, director Krishna Chaitanya, remix song | Sakshi
Sakshi News home page

ఎంతవారులైన గాని వేదాంతులైన గాని..

Jul 23 2014 1:40 PM | Updated on Sep 27 2018 8:48 PM

ఎంతవారులైన గాని వేదాంతులైన గాని.. - Sakshi

ఎంతవారులైన గాని వేదాంతులైన గాని..

నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ‘రౌడీ ఫెలో’ సినిమా కోసం పెద్ద ఎన్టీఆర్ పాటను రీమిక్స్ చేశారు.

టాలీవుడ్ లో రీమిక్స్ పాటల జోరు కొనసాగుతోంది. ప్రతి సినిమాలోనూ రీమిక్స్ పాటలు సాధారణమైపోయాయి. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ‘రౌడీ ఫెలో’ సినిమా కోసం పెద్ద ఎన్టీఆర్ పాటను రీమిక్స్ చేశారు. మహ్మద్ రఫీ పాడిన 'ఎంతవారులైన గాని వేదాంతులైన గాని' అనే పాటను రీమిక్స్ చేసి ఈ సినిమాలో పెడుతున్నారు.

రీమిక్స్ వెర్షన్ చాలా బాగా వచ్చిందని, యువశ్రోతలను ఆకట్టుకునేలా సంగీతం కుదిరిందని దర్శకుడు చైతన్య కృష్ణ తెలిపారు. పెద్ద ఎన్టీఆర్ నివాళిగా ఈ రీమిక్స్ పాట పెడుతున్నామని అన్నారు. రోహిత్ సరసన విశాఖాసింగ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, పోసాని, పరుచూరి వెంకటేశ్వరరావు, తాళ్లూరి రామేశ్వరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement