నటనే... నాప్రాణం

Regina Cassandra special interview

సాక్షి’ ప్రత్యేక ఇంటర్వూ్యలో కథానాయకి రెజీనా కసండ్రా

కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ): నటన అంటే ప్రాణం... అందుకే ఈ రంగంలోకి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులు అందించే ప్రేమాభిమానాలతో మనసు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.. అందులోను తూర్పుగోదావరి జిల్లా...ఇక్కడి అందాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయంటున్నారు హీరోయిన్‌ రెజీనా. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ప్రశ్న: సినిమాలపై ఇష్టం ఎలా ఏర్పడింది?
జవాబు:నాకు నటన అంటే చాలా ఇష్టం, ఆ మక్కువతోనే ప్రథమంగా యాంకరింగ్‌ చేసేదాన్ని. తర్వాత ఎస్‌ఎమ్మెస్‌ సినిమా ఆడిషన్స్‌లో నాకు అవకాశం వచ్చింది. ఆ సినిమా మంచి హిట్‌ కావడంతో అప్పటినుంచి ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి.
ప్రశ్న: ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు?
జవాబు:20 వరకు చేశా.. దాదాపు పెద్దస్థాయి హీరోలందరితోనూ నటించా.
ప్రశ్న:పుట్టిన ఊరు?
జవాబు:చెన్నై
ప్రశ్న:ఏం చదువుకున్నారు?
జవాబు: బీఎస్సీ సైకాలజీ చదివాను, హీరోయిన్‌ కాకపోతే అదే వృత్తిలో కొనసాగేదాన్ని.
ప్రశ్న:ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు?
జవాబు: నారా రోహిత్‌తో బాలకృష్ణుడు, మరో కొత్త సినిమా ప్రారంభమయ్యింది, తమిళంలో మరో సినిమా చేస్తున్నాను.
ప్రశ్న: రాజమహేంద్రవరం ఇదే రావడమా, ఇక్కడ నచ్చింది ఏమిటి?
జవాబు: శంకర అనే మూవీ షూటింగ్‌కు వచ్చాను. ఇక్కడ పూతరేకులు చాలా బాగున్నాయి.
ప్రశ్న: అవార్డులు..?
జవాబు: సైమా అవార్డుల ఫంక్షన్‌లో బెస్ట్‌ ఫిమేల్‌ అవార్డును శివ మనసులో శృతి అనే సినిమాకు అందుకున్నాను.
ప్రశ్న:మీరు నటించి....మీకు నచ్చిన సినిమాలు?
జవాబు: రవితేజ హీరోగా నటించిన పవర్, సాయిథరమ్‌తేజ్‌ హీరోగా నటించిన పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్‌ సేల్, సౌఖ్యం, నక్షత్రం, రొటీన్‌ లవ్‌స్టోరీ, కొత్తజంట, రారా కృష్ణయ్య..
ప్రశ్న: చివరిగా ఆడవాళ్లకు.. ఈ గ్లామర్‌ ప్రపంచంలో బయట మహిళలకు మీరిచ్చే సందేశం ఏమిటి?
జవాబు: భయం లేకుండా ముందుకు సాగితే ఆడ, మగా అనే తేడానే ఉండదు. ఎందోరో ఆడవాళ్లు కీర్తి శిఖరాలనధిరోహించారు. వారిని ఆదర్శంగా తీసుకుని, వారి జీవిత చరిత్రలను చదువుతూ వారి బాటలో సాగాలి. ప్రథమంగా స్త్రీకి ధైర్యం కావాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top