ముహూర్తం కుదిరిందా?

Ranveer Singh and Deepika Padukone getting married on November 10 - Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దీపికా–రణ్‌వీర్‌ల పెళ్లి ముహూర్తం కుదిరింది. ఈ ఏడాది నవంబర్‌ 10న ఈ ఇద్దరూ ఒకటి కాబోతున్నారట. సరైన డేట్‌ కోసం కొంత కాలంగా ఎదురుచూస్తున్న ఈ జంటకు  నవంబర్‌10 బెస్ట్‌ అనిపించిందట. అనుష్కా శర్మ, విరాట్‌ కోహ్లీలానే వీళ్లద్దరు కూడా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోనున్నారని భోగట్టా. వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది. ఆల్రెడీ జనవరిలో దీపికా బర్త్‌డే అప్పుడు మాల్దీవ్స్‌లో ఎవరికీ తెలియకుండా దీపికా, రణ్‌వీర్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని వార్తలు కూడా వినిపించాయి. కేవలం కుటుంబ సభ్యులు, మిత్రుల మధ్య  వివాహం చేసుకున్నాక ఇండస్ట్రీ వాళ్ల కోసం బెంగళూర్‌లో వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారని టాక్‌. పెళ్లికి సంబంధించిన షాపింగ్‌ కూడా ఆల్రెడీ మొదలెట్టారట. రెండు కుటుంబాలూ మెహందీ, సంగీత్‌.. అంటూ పెళ్లికి సంబంధించిన వేడుకలను ఘనంగా ప్లాన్‌ చేస్తున్నారట.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top