‘నా గర్ల్‌ఫ్రెండ్‌ను మోసం చేశాను’

Ranbir Kapoor Once Admitted To Cheating On His Girlfriend - Sakshi

బాలీవుడ్‌ లవర్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. సంజు మూవీ హిట్‌తో ఇటు ప్రొపెషనల్‌ లైఫ్‌లో, కో స్టార్‌ అలియా భట్‌తో ఏర్పడిన సరికొత్త ప్రేమ బంధంతో అటు పర్సనల్‌ లైఫ్‌లోనూ సంతోషంగా గడుపుతున్నారు. అయితే సినిమాల కన్నా... హీరోయిన్లతో కొనసాగించిన ప్రేమాయణాలతోనే ఈ చాక్లెట్‌ బాయ్‌ ఎక్కువగా వార్తల్లో నిలిచారు. సంజు ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ.. ‘సంజుకు 308 మంది ఉన్నారు. కానీ, తన ప్రియురాళ్ల సంఖ్య ఇంకా పదికి కూడా చేరలేదని’ రణ్‌బీర్‌ నిజాయితీగా ఒప్పేసుకున్నాడు కూడా. అలియాతో రిలేషన్‌ షిప్‌ గురించి చెబుతూ... ‘ప్రేమలో పడటం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కొత్త మనిషి.. కొత్త ఆలోచనలు.. పాత విషయాలనే మరోసారి కొత్తగా చేస్తుంటామని.. అయితే ప్రస్తుతం తాను చాలా మారానని, బంధాలకు చాలా విలువ ఇస్తానని’ అన్నారు.

దీపికాతో బ్రేకప్‌ అనంతరం కూడా రణ్‌బీర్‌ ఇలాగే ఎమోషనల్‌గా మాట్లాడారు. ‘అవును. నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ను మోసం చేశాను. అపరిపక్వత, అనుబంధాలను పటిష్ట చేసుకునే నేర్పు లేకపోవడం.. అడ్వాంటేజ్‌ తీసుకోపోవడం.. ఇవన్నీ నా తప్పులే. కానీ ప్రస్తుతం నేను రియలైజ్‌ అయ్యాను. అందుకే ఓ కొత్త వ్యక్తితో.. ఓ ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను. మా ఇద్దరికీ పరస్పరం నమ్మకం, ప్రేమ ఉన్నాయి. గతంలో నాకు ఇలాంటి వ్యక్తి తారసపడలేదు. అందుకే బ్రేకప్‌ అయ్యిందంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కత్రినా గురించి గొప్పగా చెప్పారు. అయితే ప్రస్తుతం కత్రినాతో బ్రేకప్‌ చేసుకున్న తర్వాత అలియా గురించి కూడా ఇలాగే మాట్లాడటంతో.. రణ్‌బీర్‌ మాటలను ఎంత వరకు నమ్మాలో అర్థం కావడం లేదంటూ బాలీవుడ్‌ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top