కంగనా వ్యాఖ్యలపై స్పందించిన రణ్‌బీర్‌ కపూర్‌

Ranbir Kapoor Finally Reacts to Kangana Ranaut Attacks - Sakshi

తానేంటో.. ఎప్పుడు ఏం మాట్లాడాలో తనకు బాగా తెలుసంటున్నారు బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌. అనవసర వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకోవడం తనకు ఇష్టం ఉండదన్నారు రణ్‌బీర్‌. గతంలో తనను ఉద్దేశించి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా రణ్‌బీర్‌ స్పందిస్తూ ఇలా మాట్లాడారు. గతంలో రాజకీయాల గురించి రణ్‌బీర్‌ అభిప్రాయం కోరగా.. ‘నా ఇంటికి విద్యుత్‌, నీళ్ల సరఫరా బాగానే జరుగుతుంది. అలాంటప్పుడు నేనేందుకు రాజకీయాల గురించి మాట్లాడాల’ని ఎదురు ప్రశ్నించారు రణ్‌బీర్‌.

రణ్‌బీర్‌ వ్యాఖ్యలపై కంగనా స్పందిస్తూ.. ‘రణ్‌బీర్‌ లాంటి నటులు విలాసవంతమైన ఇళ్లలో ఉంటూ.. అన్ని సౌకర్యాలు అనుభవిస్తుంటారు. అందుకే ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతుంటారు. కానీ నేను మాత్రం వారిలా ప్రవర్తింలేను’ అన్నారు. అయితే ఈ ఆరోపణలన్ని గతంలో వచ్చినవి. వీటిపై రణ్‌బీర్‌ తాజాగా స్పందిస్తూ.. ‘ఎవరు ఏ విషయం గురించి ప్రశ్నించిన నేను సమాధానం ఇస్తాను. కానీ నాకు పూర్తిగా ఆసక్తి లేని అంశాల గురించి నన్ను ప్రశ్నిస్తే.. నేను సమాధానం చెప్పలేను. ఆసక్తి లేని అంశాల గురించి మాట్లాడి వివాదాల్లో చిక్కుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఈ విషయం గురించి జనాలు ఏం అనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకుంటే నేనేంటో.. ఏం మాట్లాడుతున్నానో నాకు పూర్తిగా తెలసం’టూ పరోక్షంగా కంగనా వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు రణ్‌బీర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top