కాజల్.. కేథరిన్...మధ్యలో రానా | Rana Daggubati to romance Kajal Aggarwal and Catherine Tresa in his next | Sakshi
Sakshi News home page

కాజల్.. కేథరిన్...మధ్యలో రానా

Jul 10 2016 12:10 AM | Updated on Sep 4 2017 4:29 AM

కాజల్.. కేథరిన్...మధ్యలో రానా

కాజల్.. కేథరిన్...మధ్యలో రానా

ప్రేమ కథలతో సంచనాలత్మక చిత్రాలు రూపొందించిన దర్శకుడు తేజ... ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా...

ప్రేమ కథలతో సంచనాలత్మక చిత్రాలు రూపొందించిన దర్శకుడు తేజ... ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా... వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే రేర్ న్యూసే మరి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నాయిక అంటే అది కూడా స్పెషల్ న్యూసే. ఎందుకంటే తేజ దర ్శకత్వం వహించిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతోనే కాజల్ తెలుగు తెరకు పరిచయమయ్యారు.
 
  దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తేజతో కాజల్ చేయనున్న చిత్రమిదే. ముందు రానా, కాజల్‌ని ఎంపిక చేసి ఫొటోషూట్ కూడా చేశారు. తాజాగా కేథరిన్ చేరారు. మరో నాయికగా ఆమెను ఎంపిక చేశారు. ఓ భిన్నమైన కథాంశంతో తేజ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అనూప్ రూబెన్స్ స్వరకర్త.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement