సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ఆత్మకథ రాశారు. అది కూడా మొత్తం సిద్ధమైపోయింది. వచ్చే నెలలోనే విడుదలై మార్కెట్లను ముంచెత్తనుంది.
హైదరాబాద్: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ. అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప నటుడిని ఇడియట్ అనడం ఆయనకే చెల్లు. అండర్ వరల్డ్ తో తనకు సంబంధాలు ఉన్నాయని కూడా బహిరంగంగా చెప్పగలడు. అలాంటి రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ఆత్మకథ రాశారు. అది కూడా మొత్తం సిద్ధమైపోయింది. పుస్తకం మాత్రం వచ్చే నెలలోనే విడుదలై మార్కెట్లను ముంచెత్తనుంది. ఈ విషయాన్ని స్వయంగా వర్మే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. పుస్తకం కవర్ పేజిని కూడా ఆయన చూపించారు. రూపా పబ్లికేషన్స్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోందని తెలిపారు.
The book's Cover design of my autobiography to be released next month by Rupa publications pic.twitter.com/0fnWgz8KT1
— Ram Gopal Varma (@RGVzoomin) November 13, 2015
Some chapters in it..When I called Amitabh bachchan an idiot,My affair with the Underworld,Women in My Filmy Life pic.twitter.com/qWqhsZHapn
— Ram Gopal Varma (@RGVzoomin) November 13, 2015


