నిర్మాణ రంగంలోనూ మెగా మార్క్ | Ramcharan Planing 2 production houses | Sakshi
Sakshi News home page

నిర్మాణ రంగంలోనూ మెగా మార్క్

Oct 11 2015 9:24 AM | Updated on Jul 23 2019 11:50 AM

నిర్మాణ రంగంలోనూ మెగా మార్క్ - Sakshi

నిర్మాణ రంగంలోనూ మెగా మార్క్

సంస్థలను స్థాపించి నిర్మాణం రంగంలోనూ హవా కొనసాగించాలనుకుంటున్నారు.

యంగ్ హీరో రామ్ చరణ్ హీరోగానే గాక నిర్మాణ రంగంలోనూ తన మార్క్ చూపించాలనుకుంటున్నారు. అందుకే ఒకేసారి రెండు నిర్మాణ సంస్థలను స్థాపించి నిర్మాణం రంగంలోనూ హవా కొనసాగించాలనుకుంటున్నారు. చిరు రీ ఎంట్రీ సినిమాను తన సొంతం నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కిస్తున్న చరణ్, తరువాత కూడా వరుసగా సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

చిరు 150 వ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న చరణ్.. వైట్ హార్స్ ఎంటర్టైన్మెంట్స్  బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ బ్యానర్పై 5 కోట్ల లోపు బడ్జెట్తో సినిమాలను తెరకెక్కించనున్నారు. ఈ బ్యానర్ ద్వారా కొత్త నటీనటులను, దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు మెగా పవర్ స్టార్. చరణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రూస్ లీ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 16న రిలీజ్ అవుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement