ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తరువాతే కొత్త లుక్‌ | Ram Charan New look for Boyapari Srinu Film | Sakshi
Sakshi News home page

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తరువాతే కొత్త లుక్‌

Feb 28 2018 12:38 PM | Updated on Feb 28 2018 12:38 PM

Ram Charan New look for Boyapari Srinu Film - Sakshi

రామ్‌ చరణ్‌

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా  షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే చరణ్ కూడా యూనిట్ తో జాయిన్‌కావాల్సి ఉంది.

కానీ ఇప్పటికీ చరణ్ రంగస్థలం లుక్‌లోనే కనిపిస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న చరణ్ లుక్‌ రంగస్థలంలో సినిమాలో ఉన్నట్టుగానే ఉంది. దీంతో బోయపాటి సినిమాలో చరణ్ లుక్‌ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా చరణ్ రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తరువాతే కొత్త లుక్‌ లోకి మారనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడే లుక్ రివీల్ చేయటం ఇష్టం లేని చరణ్ అండ్ టీం.. ఈ నిర్ణయంత తీసుకున్నారట. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తోపాటు కొంత మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పూర్తయిన తరువాతే రామ్ చరణ్‌ బోయపాటి సినిమాకు రెడీ కానున్నాడు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈసినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ విలన్‌గా సీనియర్‌ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం) మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement