విక్రమ్కు జోడిగా రకుల్..? | Rakul to act with Vikram in Saamy 2 | Sakshi
Sakshi News home page

విక్రమ్కు జోడిగా రకుల్..?

Oct 12 2016 12:44 PM | Updated on Jul 23 2019 11:50 AM

విక్రమ్కు జోడిగా రకుల్..? - Sakshi

విక్రమ్కు జోడిగా రకుల్..?

చిన్న సినిమాల హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.., టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సరసన చేరిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే...

చిన్న సినిమాల హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.., టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సరసన చేరిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే సరిపెట్టుకుంటుంటే.. రకుల్ మాత్రం భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ద్విభాషా చిత్రంతో పాటు, రాం చరణ్ ధృవలోనూ హీరోయిన్గా నటిస్తోంది.

తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా.. కోలీవుడ్లో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. తమిళంలో తడైయర తక్క సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తొలి సినిమా సక్సెస్ ఇవ్వకపోయినా కోలీవుడ్లో కూడా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇప్పటికే విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తుప్పరివాలన్ సినిమాలో నటిస్తోన్న రకుల్,  మరో భారీ ప్రాజెక్ట్కు సైన్ చేసింది.

విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్  సామి 2లో రకుల్ హీరోయిన్గా నటించనుంది. తమిళ నాట ఘనవిజయం సాధించిన సామి సినిమాకు సీక్వల్గా అదే కాంబినేషన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తొలి భాగంలో త్రిష హీరోయిన్గా నటించగా సీక్వల్ కోసం రకుల్ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. ప్రస్తుతం సింగం 3 పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు హరి ఆ సినిమా పూర్తి అయిన తరువాత సామి 2 ప్రారంభమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement