పార్టీలకు వెళితే పని ఇవ్వరు | Rakul Preet Singh Secret Mantra For Tolly and Bollywood Entry | Sakshi
Sakshi News home page

పార్టీలకు వెళితే పని ఇవ్వరు

Nov 12 2019 12:46 AM | Updated on Nov 12 2019 12:46 AM

Rakul Preet Singh Secret Mantra For Tolly and Bollywood Entry - Sakshi

రకుల్‌ ప్రీత్‌సింగ్‌

‘‘హిందీ పరిశ్రమ షూటింగ్‌ ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా మనం కాంటాక్ట్‌లో ఉండాలని కోరుకుంటుంది. అదే సౌత్‌లో అయితే మన తరఫున మన మేనేజర్లే సినిమాకి సంబంధించిన విషయాలను మాట్లాడతారు’’ అని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. అంటే... అవకాశాలు తెచ్చుకోవాలంటే బాలీవుడ్‌లో పార్టీలంటూ టచ్‌లో ఉండాలన్నది మీ ఉద్దేశమా అనే ప్రశ్నకు రకుల్‌ స్పందిస్తూ – ‘‘నా ఉద్దేశం అది కాదు. పార్టీలకు వెళితే ఎవరూ పని ఇవ్వరు.

టాలెంట్‌ ముఖ్యం. అయితే కాంటాక్ట్‌లో ఉండటంవల్ల మనం ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నామో అలాంటివి వచ్చే అవకాశం ఉంది. అయితే అది కూడా టాలెంట్‌ ఉన్నవాళ్లకే. ఇప్పుడు ‘కంటెంట్‌’ ఉన్న సినిమాలకే క్రేజ్‌ ఉంది. అలాంటి సినిమాల్లో నటించాలంటే టాలెంటెడ్‌ ఆర్టిస్టులు కావాలి. మనం టాలెంటెడ్‌ అయితే పార్టీలకు వెళ్లినా వెళ్లకపోయినా కచ్చితంగా అవకాశాలు వస్తాయి. అయితే కొంచెం సమయం పట్టొచ్చు. ఫైనల్‌గా మన స్థానం మనకు ఉంటుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement