అంతకు మించి | rakesh roshan plans to krish 4 | Sakshi
Sakshi News home page

అంతకు మించి

May 25 2018 4:12 AM | Updated on May 25 2018 4:12 AM

rakesh roshan plans to krish 4 - Sakshi

హృతిక్‌ రోషన్‌

ఇండియన్‌ సూపర్‌ హీరో ‘క్రిష్‌’ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేశాడు. అందుకే వరుసగా సీక్వెల్స్‌ రూపొందిస్తున్నారు దర్శక–నిర్మాత రాకేష్‌ రోషన్‌. ఆల్రెడీ ‘క్రిష్‌ 4’ని 2020 క్రిస్మస్‌ స్పెషల్‌గా రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నట్టు హృతిక్‌ బర్త్‌ డే (జనవరి 10) రోజున అనౌన్స్‌ చేశారు హృతిక్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌. ఇప్పుడు ‘క్రిష్‌ 5’ కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్‌ టాక్‌. క్రిష్‌ 4, 5 సినిమాలను ఒకేసారి షూట్‌ చేసి, ఎడిట్‌ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట చిత్రబృందం. ఈ రెండు సీక్వెల్స్‌కు ఇంటర్నేషనల్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేయనున్నారట. గత పార్ట్స్‌ని మించి గ్రాండ్‌ విజువల్స్‌తో భారీగా ఉంటాయని సమాచారం.

గత సినిమాల్లో ప్రీతీ జింటా, ప్రియాంకా చోప్రా హీరోయిన్లుగా కనిపించారు. ఈ కొత్త సీక్వెల్స్‌లో కొత్త కాంబినేషన్‌ సెట్‌ అవ్వొచ్చట. మరి.. ఈ సూపర్‌ హీరోని మళ్లీ స్క్రీన్‌ మీద చూడాలంటే మరో రెండు మూడేళ్లు వేచి చూడక తప్పదు. అన్నట్లు ఒకేసారి షూట్‌ చేయబోతున్నారు కాబట్టి ఒకేసారి రిలీజ్‌ చేస్తారేమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అది జరగనే జరగదు. ముందు ఫోర్త్‌ పార్ట్‌ రిలీజ్‌ చేస్తారు. ఫిఫ్త్‌ పార్ట్‌ టెక్నికల్‌గా ఇంకా భారీగా ఉండటంతో ముందు షూట్‌ చేయాలనుకున్నారట. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కి ఎక్కువ టైమ్‌ పడుతుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement