మరో రికార్డు బ్రేక్ చేసిన కబాలి | Rajinikanth's 'Kabali' teaser highest viewed Indian film teaser | Sakshi
Sakshi News home page

మరో రికార్డు బ్రేక్ చేసిన కబాలి

May 13 2016 1:01 PM | Updated on Sep 4 2017 12:02 AM

మరో రికార్డు బ్రేక్ చేసిన కబాలి

మరో రికార్డు బ్రేక్ చేసిన కబాలి

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతోంది.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతోంది. విడుదలైన 22 గంటల్లోనే కబాలి టీజర్ 50 లక్షలకు పైగా హిట్లు సంపాదించి రికార్డు సృష్టించగా.. తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. ఈ టీజర్ను ఇప్పటి వరకు కోటి 71 లక్షల మంది వీక్షించారు. తద్వారా అత్యధిక హిట్లు వచ్చిన ఇండియన్ ఫిల్మ్ టీజర్గా రికార్డు సాధించింది. రజనీ దెబ్బకు అమీర్ ఖాన్ దూమ్ 3, సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాల టీజర్ల రికార్డులు బ్రేక్ అయ్యాయి. మే 1న విడుదలైన కబాలి టీజర్ సంచనాలు సృష్టిస్తోంది.  

65 ఏళ్ల లేటు వయసులో రజనీ డాన్‌ పాత్రలో నటించిన కబాలి సినిమా టీజర్ అభిమానులకు పండుగ చేస్తోంది. 'పాత తెలుగు చిత్రాల్లో ముఖం మీద గాటు పెట్టుకుని, లుంగీ కట్టుకుని.. కబాలి అనగానే రెండు చేతులు కట్టుకుని చెప్పండి బాబూ అని వంగి నమస్కారం చేస్తాడనుకున్నావా? ఈ కబాలి వేరు...' అని కబాలి పాత్రలో రజనీకాంత్ ప్రత్యర్థికి కౌంటర్ ఇచ్చే ఈ టీజర్ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను ఓ ఊపు ఊపేసింది. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ భార్యగా రాధికా ఆప్టే నటిస్తుండగా.. ఇతర పాత్రలలో కలైరసన్, దినేష్, రిత్విక తదితరులు నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement