తలైవా అభిమానుల అసంతృప్తి

Rajinikanth Fans Are Disappointed About Kaala Emoji - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా వస్తోందంటే అభిమానులకు పండుగే. రజనీ సినిమాలు ఫెయిల్‌ అయినా సరే ఈ సూపర్‌స్టార్‌ క్రేజ్‌ ఏ మాత్రం చెక్కుచెదరదు. గత కొంతకాలంగా తలైవాకు సరైన హిట్‌ లేదు. కొచ్చాడియన్‌, లింగా, కబాలి సినిమాలు ఆశించనంతగా ఆడలేదు. అయినా సరే మళ్లీ రజనీ సినిమా వస్తుందంటే అభిమానలు వేయి కళ్లతో ఎదురు చూస్తూంటారు. ప్రస్తుతం కాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

కబాలి ఫేం పా రంజిత్‌ డైరెక్షన్‌లో రాబోతున్న కాలా చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కబాలి విడుదల సమయంలో చేసిన ప్రమోషన్‌ కార్యక్రమాలు బహుశా ఏ ఇతర భారతీయ సినిమాలకు చేసి ఉండరు. ఏకంగా విమానాలపై కబాలి పోస్టర్స్‌ను వేశారు. కొన్ని ప్రైవేట్‌ సం‍స్థలు కబాలి రిలీజ్‌ రోజున సెలవు కూడా ప్రకటించాయి. ఇప్పుడు కాలా సినిమాకు ట్విటర్‌ ఎమోజీని క్రియేట్‌ చేశారు చిత్రయూనిట్‌. అయితే దీనిపై తలైవా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఆ ఎమోజీలో రజనీ సరిగా కనబడటం లేదని అభిమానులు వాపోతున్నారు. మరికొందరు కొన్ని నమూనాలను డిజైన్‌ చేసి చిత్రయూనిట్‌కు ట్యాగ్‌ చేశారు. మరి వీరి బాధను కాలా టీం పట్టించుకుంటుందో లేదో చూడాలి.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top