బావ బావమరిది?

‘గరుడవేగ’ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు రాజశేఖర్. ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ జోష్‌లో ఉన్నారు తేజ. అదే జోష్‌తో వెంకటేశ్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి ‘ఆట నాదే వేట నాదే’ టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ నెల 13న వెంకీ బర్త్ డేకి ఈ సినిమాకి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో రాజశేఖర్ నటించనున్నారట.
‘‘కథ, పాత్ర నచ్చితే విలన్‌గా, ఇతర పాత్రల్లో నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అని ఇటీవల రాజశేఖర్ చెప్పిన విషయం తెలిసిందే. తేజ చెప్పిన కథ రాజశేఖర్‌కు నచ్చిందట. క్యారెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఇందులో రాజశేఖర్ విలన్‌గా చేయబోతున్నారట. వెంకీకి బావగా కనిపించనున్నారని మరో టాక్.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి