దటీజ్‌ మహాలక్ష్మి

Queen Telugu remake Title is was that is Mahalakshmi - Sakshi

... అనగానే టక్కున తమన్నా గుర్తుకు రాక మానరు. నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘100 పర్సెంట్‌ లవ్‌’ చిత్రంలోని ‘దటీజ్‌ మహాలక్ష్మి..’ పాట, తమన్నా చెప్పిన ఆ డైలాగ్‌ ఎంత పాపులర్‌ అయ్యాయో తెలిసిందే. మహాలక్ష్మి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు మిల్కీ బ్యూటీ. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు? అనేగా మీ డౌట్‌. అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌లో  తమన్నా లీడ్‌ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అ’ సినిమా ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘దటీజ్‌ మహాలక్ష్మి’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు.

‘మీ సినిమా టైటిల్‌ ‘ఇట్స్‌ మీ మహాలక్ష్మి’, ‘దటీజ్‌ మహాలక్ష్మి’.. ఈ రెంటిలో ఏది? అని ఓ అభిమాని ట్వీటర్‌లో అడిగిన ప్రశ్నకు ‘కన్‌ఫ్యూజ్‌ అవ్వొద్దు... ‘దటీజ్‌ మహాలక్ష్మి’ అని క్లారిటీ ఇచ్చారు తమన్నా. ‘క్వీన్‌’ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రీమేక్‌ అవుతోంది. తమిళంలో కాజల్‌ అగర్వాల్‌ చేస్తోన్న ఈ చిత్రానికి ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ టైటిల్‌ కన్ఫార్మ్‌ చేశారు.  కన్నడ వెర్షన్‌కి ‘బటర్‌ఫ్లై’ అని పెట్టారు. ఇందులో పరుల్‌ యాదవ్‌ కథానాయికగా నటిస్తున్నారు. మలయాళ రీమేక్‌లో మంజిమా మోహన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జామ్‌ జామ్‌’ అనే టైటిల్‌ని నిర్ణయించారు. మరి.. నాలుగు భాషల్లో ఏ ‘క్వీన్‌’ బెస్ట్‌ అనిపించుకుంటారో వేచి చూద్దాం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top