పులికేశి సీక్వెల్‌కు సిద్ధం | Pulikesi sequel in the works? | Sakshi
Sakshi News home page

పులికేశి సీక్వెల్‌కు సిద్ధం

Apr 20 2016 2:37 AM | Updated on Sep 3 2017 10:16 PM

పులికేశి సీక్వెల్‌కు సిద్ధం

పులికేశి సీక్వెల్‌కు సిద్ధం

హాస్య నటుడు వడివేలు కథానాయకుడిగా మార్చిన చిత్రం ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి అన్న విషయం తెలిసిందే.

 తమిళసినిమా; హాస్య నటుడు వడివేలు కథానాయకుడిగా మార్చిన చిత్రం ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు శంకర్ తన ఎస్.పిక్చర్స్ పతాకంపై నిర్మించి శిష్యుడు శింబుదేవన్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. 2006లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ తరువాత వడివేలు నటించిన ఏ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆయన కూడా ఆ తరువాత మళ్లీ హాస్య పాత్రలు పోషించడానికి సుముఖం వ్యక్తం చేయలేదు.
 
 తాజాగా విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న కత్తి సండై చిత్రంలో హాస్యభూమికను పోషించడానికి అంగీకరించారు. కాగా తనను హీరోగా చేసిన ఇంసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రానికి సీక్వెల్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నారని తాజా సమాచారం. దీనికీ శింబుదేవన్  దర్శకత్వం వహించనున్నారు. సీక్వెల్ చిత్రం అయినా ఈ దర్శకుడిని ఆదుకుంటుందేమో చూడాలి. ఎందుకంటే ఆ తరువాత శింబుదేవన్ చేసిన ఇరుంబు కోట్లై మోరట్టు సింగం,విజయ్ హీరోగా ఇటీవల చేసిన పులి చిత్రం నిరాశపరిచాయి.
 
 ఈ చిత్రాన్ని చాలా కాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న దర్శకుడు శంకర్ ఎస్.పిక్చర్స్ సంస్థ ప్రస్తుతం రజనీకాంత్‌తో 2.ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ఫిలింస్‌తో కలిసి భారీ ఎత్తున్న నిర్మించడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని లైకా సంస్థ నిర్వాహకుడు రాజు మహాలింగం ఇటీవల స్పష్టం చేశారు. అయితే 2.ఓ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత వడివేలు పులికేసి సీక్వెల్ చిత్రం గురించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement