టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

Prashanth Neel meets Mahesh Babu - Sakshi

ఒక హీరో, ఒక డైరెక్టర్‌ కలిసి, కాసేపు మాట్లాడుకుంటే చాలు.. అది టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయిపోతుంది. నెక్ట్స్‌ సినిమా స్టోరీ కోసమే కలిశారనే ఊహాగానాలు వినిపిస్తాయి. ఇప్పుడు అలాంటిదే ఓ టాక్‌ టౌన్‌ అంతా వినిపిస్తోంది. అదే మహేశ్‌బాబు – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో సినిమా. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌.. మహేశ్‌ని కలిశారని తెలిసింది. ఓ స్క్రిప్ట్‌ విషయమై ఈ ఇద్దరూ చర్చించుకున్నారట. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో సినిమా ఉండనుందని టాక్‌. ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్లో ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ ఓ సినిమా కమిట్‌ అయిన సంగతి తెలిసిందే. మహేశ్‌తో సినిమా నిజమే అయితే ఏ సినిమా ముందు సెట్స్‌ మీదకు వెళ్తుందో వేచి చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top