‘అ’ దర్శకుడేనా?

Prasanth Varma to helm Queen remake - Sakshi

కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన ‘క్వీన్‌’ సినిమా ఎంతటి భారీ హిట్‌ అయిందో తెలిసిందే. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. తెలుగులో తమన్నా లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. తమిళంలో కాజల్‌ అగర్వాల్, కన్నడలో పరుల్‌ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి నీలకంఠ దర్శకుడు. అయితే.. ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకోవడంతో కొత్త దర్శకుడు ఎవరా? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. గతంలో కొందరి దర్శకులు పేర్లు వినిపించినా తాజాగా ప్రశాంత్‌ వర్మ పేరు వినిపిస్తోంది. ఆయన దర్శకత్వం వహించిన ‘అ’ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఈ దర్శకుడితో ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top